నిప్పులు చెరిగిన బుద్దా వెంకన్న
విజయవాడ – టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. ఆయన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై మండిపడ్డారు. ఈసారి జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్ల తేడాతో ఘోరమైన ఓటమి పొందడం ఖాయని జోష్యం చెప్పారు. బుద్దా వెంకన్న శనివారం మీడియాతొ మాట్లాడారు.
కేశినేని నాని వాపు ను చూసి బలుపు అనుకున్నాడని ఎద్దేవా చేశారు. తన వెనుక పది మంది కూడా రావడం లేదన్నారు. కార్యకర్తలు, నేతలు చంద్రబాబు గెలుపు కోసం పని చేస్తారని చెప్పారు. డబ్బుల కోసం క్యారెక్టర్ ను తాకట్టు పెట్టావంటూ ఆరోపించారు బుద్దా వెంకన్న.
తమ్ముడి చేతిలో పరాజయం పొందడం ఖాయమని పేర్కొన్నారు. కేశినేని నాని మహా భారతంలో బృహన్నర లాంటోడంటూ ఎద్దేవా చేశారు. నీతో భీష్ముడు లాంటి మా వాళ్లు యుద్ధం చేయరని అన్నారు.
మూడు లక్షల ఓట్లతో ఓడిస్తావా… నీకు పిచ్చి పట్టిందంటూ మండిపడ్డారు.
ముందు నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాక నీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో అంటూ ధ్వజమెత్తారు బుద్దా వెంకన్న.