కోటి మంది యువతకు ఇంటర్నెషిప్
500 బడా కంపెనీలలో ఉద్యోగ అవకాశం
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2024ను ప్రవేశ పెట్టింది. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. యువతీ యువకులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఒక కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ ఛాన్స్ ఇప్పిస్తామని ప్రకటించారు.
ఈ నియామక ప్రక్రియ వచ్చే ఐదేళ్లలో సదరు కంపెనీల్లో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వమే దీనిని భరించేలా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్. ఈ స్కీం కింద ప్రతి నెలా రూ. 5,000 ఉపకార వేతనంగా, రూ. 6000 ఒకసారి సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇంటర్న్‌షిప్‌ను సులభతరం చేసే కంపెనీలు ఇంటర్న్‌లకు శిక్షణ ఇచ్చే ఖర్చును భరిస్తాయని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రతి ఏటా ఆయా కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద నిధులను ఉపయోగిస్తాయని చెప్పారు నిర్మలా సీతారామన్.
ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో, భారత ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు 2024-25 కేంద్ర బడ్జెట్‌లో తొమ్మిది ప్రాధాన్యతలను ప్రకటించారు. తొమ్మిది ప్రాధాన్యతలలో ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు , సంస్కరణలు ఉన్నాయి.