కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు తీపి కబురు చెప్పారు. కొత్త హంగులు చేరుస్తామన్నారు. మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవన విధానం పెంపొందిస్తామన్నారు. సుస్థిరమైన జీవన విధానం కోసం పీఎం స్వయం నిధి తీసుకువచ్చామని ప్రకటించారు.
దీని ద్వారా లక్షలాది మందికి లబ్ది చేకూరుతుందన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తామన్నారు. విద్యారంగంలో కీలక మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. ఇందులో ఏఐని ఉపయోగిస్తామన్నారు.
పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తామన్నారు. 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.
వీటిని వచ్చే ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ స్కూళ్లలో అనుసంధానం చేస్తామన్నారు. విద్యార్థుల్లో సాంకేతికతను పెంపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భారతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటల్ చేస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని తీసుకు వస్తామన్నారు. సులభంగా బోదించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు.