దేశమంటే మట్టి కాదు..దేశమంటే మనుషులు
ఢిల్లీ – భారత దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించారు. కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వాక్యాలను ఉటంకించారు ఈ సందర్బంగా. రైతులు, మహిళల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాల తో కలిపి ధన్ ధన్య కృషి యోజన పథకాన్ని తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. యువత, పేదలే లక్ష్యంగా 2025 బడ్జెట్ ను ప్రవేశ పెట్టామని చెప్పారు నిర్మలా.
రైతులకు తీపి కబురు చెప్పారు కేంద్ర మంత్రి. స్వల్ప కాల వ్యవధిలో రుణాలు అందజేస్తామని, వీటిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ థింకరింగ్ లాబ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
పాట్నాలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని విస్తరించనున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ప్రపంచ స్థాయిలో నాణ్యమైన బొమ్మల తయారీ హబ్ గా మారుస్తామని చెప్పారు. దేశాన్ని బుద్ద పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తామన్నారు. మెడికల్ టూరిజం చేస్తామన్నారు. ప్రతి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాతు చేస్తామన్నారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేయిస్తామని, వారికి ఆరోగ్య పరంగా వర్తించేలా చేస్తామని తెలిపారు. వీధి వర్తకులకు క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు.