NEWSANDHRA PRADESH

బాబు మోస‌గాడు..మాయ‌లోడు

Share it with your family & friends

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్

నంద్యాల జిల్లా – ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా డోన్ లో ప‌ర్య‌టించి ప్ర‌సంగించారు.

మేని ఫెస్టో మోస‌గాడు..నెర‌వేర్చ‌ని హామీల మాయ లోడు అంటూ ధ్వ‌జ‌మెత్తారు. డోన్ లో వార్ వ‌న్ సైడ్ కాక త‌ప్ప‌ద‌న్నారు. ప‌లువురు వైఎస్సార్ పార్టీలో ప‌లువురు చేర‌డం ఆనందంగా ఉంద‌న్నారు మంత్రి. అభివృద్ధి ప్రదాతతో అడుగులు వేసేందుకు క్యూ క‌డుతున్నార‌ని చెప్పారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ముట్టుకోని కూటమి మేనిఫెస్టో ..అమలు సాధ్యమా అని ప్ర‌శ్నించారు. మేనిఫెస్టో పుస్తకం మీద మోదీ బొమ్మ లేక పోవడం, బీజేపీ ఏపీ ఇంచార్జ్ సిద్ధార్థ్ సింగ్ మేనిఫెస్టో బుక్ లెట్ ను కనీసం ముట్టుకోక పోవడం సామాన్య ప్రజలకు అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు.

ఇంట్లో పెద్దన్న ఒప్పుకోకుండా ఆడపడచు లాంఛనాలు నిశ్చయించినట్లు..మేనిఫెస్టో అమలు జరగదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో చదవడానికి తప్ప అమలు జరగడం అసాధ్యమన్నారు. తాత్కాలిక వాగ్ధానాలతో ఎలాగైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే ఆలోచన తప్ప నిజంగా వాటిని అమలు చేయడం చంద్రబాబు వల్ల కాదన్నారు.