NEWSANDHRA PRADESH

ఏపీలో మ‌ళ్లీ మాదే స‌ర్కార్

Share it with your family & friends

బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి
నంద్యాల‌ జిల్లా – ఏపీలో తిరిగి త‌మ‌దే రాజ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా డోన్, నంద్యాల‌, బేతంచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌టించి ప్ర‌సంగించారు. రాబోయే నెల రోజుల్లో తాము తిరిగి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

గూటుపల్లెలో 300 మంది రైతులకు 500 ఎకరాల భూమి పంపిణీ చేశామ‌ని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 50 టీడీపీ కుటుంబాలు చేర‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. డీ పట్టా భూములపై సర్వ హక్కులు కల్పించి 150 మంది అన్నదాతలకు మరో 200 ఎకరాలను పంపిణీ చేశామన్నారు.

వక్ఫ్ భూములలో 1738 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయలేని విధంగా మిగిలి పోతే వాటిని కూడా కన్వెర్షన్ చేయించే ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా వక్ఫ్ బోర్డు సీఈవోకు పంపినట్లు పేర్కొన్నారు. నెల రోజులలో మళ్లీ ఏర్పాటు కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

చెప్పినవన్నీ చేసే వారికి, చెప్పిందేది చేయని చంద్రబాబుకు మధ్య మే 13న ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఎంపీపీగా ఒక్క చిన్న పని కూడా చేయని స్థానిక నాయకుడు సోమశేఖర్ రెడ్డి వ్యవస్థ బాగు చేయడానికి టీడీపీలో చేరానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ చుట్టు పక్కల గ్రామాల్లో జీపుల మీద తుపాకి పెట్టుకుని భేూములను బలవంతంగా మార్చుకున్నది గుర్తుందా ? ఇపుడు ఆ వ్యవస్థ నచ్చిందా అని ప్రశ్నించారు. తన బంధువు తెలుగుదేశం పార్టీ కాబట్టి తాను కూడా అదే పార్టీలో చేరి కన్న ఊరికి వెన్నుపోటు పొడిచారన్నారు.

మాజీ ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి ఎంపీపీ పదవిని స్వలాభం కోసం మినహా ఏనాడు ప్రజలకు సాయం కోసం ఉపయోగించ లేదన్నారు. 15 ఏళ్లు సొంత ఊరిని వదిలేసి పోయి ఇపుడు వచ్చి వ్యవస్థను మారుస్తారా అంటూ మంత్రి ప్రశ్నించారు.