కమిషనర్ నిర్వాకం బుగ్గన ఆగ్రహం
డోన్ లో మున్సిపల్ పార్క్ కు తాళం
నంద్యాల జిల్లా – మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డోన్ లో మున్సిపల్ కమిషనర్ అనుసరించిన తీరు పట్ల ఫైర్ అయ్యారు. వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్ కు వస్తున్నారని తెలిసి , టీడీపీ నేతల సూచనల మేరకు కమిషనర్ దానికి తాళం వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు.
మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు ఫోన్ చేసినా కనీసం స్పందించ లేదని మండిపడ్డారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ఇదేనా ప్రజా ప్రభుత్వ పాలన అంటూ నిప్పులు చెరిగారు. మరీ ఇంత దుర్మార్గపు రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేరుతో రాచరిక సర్కార్ కొనసాగుతోందని ఆరోపించారు. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని పేర్కొన్నారు. ఇక ప్రచారం తప్పా ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదంటూ టీడీపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ది చెప్పడం ఖాయమని పేర్కొన్నారు .