NEWSANDHRA PRADESH

ఆర్థిక నేరస్తుడంటే అర్థం తెలుసా

Share it with your family & friends

ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఎలా

క‌ర్నూలు జిల్లా – ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌పై తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా నిప్పులు చెరిగారు బుగ్గ‌న‌. ఆర్థిక నేర‌స్తుడంటే అర్థం తెలుసా అని ప్ర‌శ్నించారు.

ప్రభుత్వ నిధులేం కొల్ల గొట్టలేదని అన్నారు, ఏ బ్యాంకు నుంచి నోటీసులు రాలేదని చెప్పారు, సేల్స్ ట్యాక్స్, ఇన్ కం ట్యాక్స్ పక్కాగా కడుతున్నాన‌ని బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి చెప్పారు. ద‌మ్ముంటే తాను ఆర్థిక నేర‌స్థుడిన‌ని నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు.

నీ చ‌రిత్ర గురించి ఎవ‌రికి తెలియ‌ద‌ని అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ‘కోట్ల’ చేయి బదుళ్లు తీసుకుని వారికి ఎగ్గొట్టింది నిజం కాదా అని నిల‌దీశారు బుగ్గున రాజేంద్ర నాథ్ రెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబమనే గౌరవంతో పూర్తి స్వేచ్ఛగా మాట్లాడలేక పోతున్నాన‌ని అన్నారు. నీతికి అభివృద్ధికి యుద్ధమన్న మీ మాటలు ప్రజలకు అర్థం కావడం లేద‌న్నారు.
డీలర్లతో కుమ్మక్కై పేద ప్రజల బియ్యం మీ కార్యక్రమాల్లో వండి పెట్టింది ఎవరు? సంచులు సంచులు మీ లద్దగిరికి ఎందుకు వెళ్లాయి? ఎన్ని వెళ్లాయి? అని మండిప‌డ్డారు.