డొనాల్డ్ ట్రంప్ కు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు
ఎన్నికల ర్యాలీలో భారీ భద్రత కల్పన
అమెరికా – అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ఏ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బుల్లెట్ ప్రూఫ్ భద్రతా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో అధ్యక్ష పదవి ఎన్నికల కోసం హోరా హోరీగా ప్రచారం జరుగుతోంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండగా ప్రస్తుత దేశ అధ్యక్షుడిగా ఉన్న జోసెఫ్ బైడన్ తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. తనకు బదులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలిగా ఉన్న భారతీయ మూలాలు కలిగిన కమలా హారీస్ ను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుందని వెల్లడించారు. దీంతో ట్రంప్ , కమలా హారీస్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల జూలై 13న ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఓ బుల్లెట్ ఆయన చెవిని తాకింది. రక్త స్రావం కావడంతో ట్రంప్ ను చాకచక్యంగా తప్పించింది యుఎస్ సీక్రెట్ సర్వీసెస్. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బహిరంగ ర్యాలీలలో డొనాల్డ్ ట్రంప్ కు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను ఏర్పాటు చేసింది.