టీడీపీకి షాక్ సీనియర్లు గుడ్ బై
టికెట్ల కేటాయింపులో అన్యాయం
అమరావతి – ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా 175 సీట్లకు గాను 99 సీట్లను ఖరారు చేశాయి . నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ముందస్తుగా తమ పార్టీలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటంచారు.
టీడీపీ నుంచి 94 మందిని జనసేన నుంచి 5 గురు అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో తమకు సీట్లు వస్తాయని అనుకున్న సీనియర్ టీడీపీ నాయకులు ఊహించని రీతిలో షాక్ కు లోనయ్యారు. తాము ముందు నుంచీ పార్టీ కోసం పని చేశామని, కానీ అధినేత చంద్రబాబు నాయుడు మోసం చేశాడంటూ వాపోయారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.
విచిత్రం ఏమిటంటే చివరి నిమషం వరకు తనకు సీటు వస్తుందని అనుకున్నారు బూరగడ్డ వేదవ్యాస్. తనకు టికెట్ ఇవ్వక పోవడంతో ఆయన ఉన్న చోటనే కుప్ప కూలారు. చివరకు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాను తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.
తుని నుంచి యనమల కృష్ణుడు, పెడన నుంచి వేదవ్యాస్ , ఉండి నుంచి వేటుకూరి వెంకట శివ రామ రాజు పార్టీని వీడిన వారిలో ఉన్నారు. ఇది ఒక రకంగా దెబ్బేనని పార్టీ కి చెందిన నేతలు అంటున్నారు.