టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. దీంతో వెంకటేశంను పూర్తి కాలపు పదవిలో నియమించినట్లు పేర్కొంది సర్కార్. ఎవరిని నియమిస్తారనే సస్పెన్స్ కు తెర దించింది .
ఇదిలా ఉండగా టీజీపీఎస్సీ నూతన చైర్మన్ గా డిసెంబర్ 2న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు బుర్రా వెంకటేశం. ప్రస్తుతం ఆయన విద్యా శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన వీఆర్ఎస్ తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు.
అక్కడ ఓకే అయితే ఇక్కడ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. టీజీపీఎస్సీ చైర్మన్ గా తనను నియమించడం పట్ల బుర్రా వెంకటేశం స్పందించారు. వీఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నానని, అనుమతి వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు బుర్రా వెంకటేశం.