ఢిల్లీలో బేకరి ఓనర్ పునీత్ ఖురానా డెత్
న్యూఢిల్లీ – దేశంలో రోజు రోజుకు భార్య బాధితులు పెరుగుతున్నారు. ఢిల్లీకి చెందిన వ్యాపారి పునీత్ ఖురానా సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇద్దరూ విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. అయినా తనకు డబ్బులు కావాలంటూ భార్య వేధించడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
వినీత్ ఖురానా వయసు 40 ఏళ్లు. తను గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చని పోయినట్లు గుర్తించారు పోలీసులు. మోడల్ టౌన్ లోని కళ్యాణ్ విహార్ లో ఉంటున్నాడు. ఖురానా , భార్య మాణికా జగదీష్ పహ్వా గత కొంత కాలంగా మనస్పర్థలతో విడి పోవాలని నిర్ణయించుకున్నారు.
వుడ్ బాక్స్ కేఫ్ ను కలిగి ఉన్నారు కొంత కాలంగా. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో తట్టుకోలేక తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు బాధితుడు పునీత్ ఖురానా. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ తాను వ్యాపార భాగస్వామినని, తన బకాయిలను చెల్లించాలంటూ వేధింపులకు పాల్పడిందంటూ బాధితుడు పునీత్ ఖురానా ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆత్మహత్యనే తనకు మార్గమని పేర్కొన్నాడు.
ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అంతరించి పోతున్న మానవ సంబంధాలకు ఇది నిదర్శనంగా మారింది.