బైజూ రవీంద్రన్ కు బిగ్ షాక్
దావా వేసిన వాటాదారులు
న్యూఢిల్లీ – ప్రముఖ ఆన్ లైన్ విద్యా సంస్థ బైజూకు బిగ్ షాక్ తగిలింది. బైజూ ఫౌండర్ అండ్ సిఇవో రవీంద్రన్ పై సంస్థకు చెందిన వాటాదారులు దావా వేశారు. ఇదిలా ఉండగా కంపెనీలో బైజూ రవీంద్రన్ తో పాటు ఆయన కుటుంబానికి 26.3 శాతం వాటా కలిగి ఉంది.
విచిత్రం ఏమిటంటే ఇవాళ కీలకమైన సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో బైజూ సంస్థలో ప్రస్తుతం కార్య నిర్వహణ అధికారి (సిఈవో)గా ఉన్న రవీంద్రన్ ను తొలగించాలని కోరుతూ అత్యధికంగా ఓటు వేశారు. కాగా రవీంద్రన్ తో పాటు ఫ్యామిలీ సమావేశానికి దూరంగా ఉన్నారు. విధాన పరంగా చెల్లదని పేర్కొన్నారు.
మరో వైపు బైజూ సంస్థకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. మార్చి 13న కోర్టు తీర్పు వెలువడేంత దాకా ఓటింగ్ ఓటు వర్తించదని బైజూ రవీంద్రన్ అంటున్నారు. ఒకప్పుడు భారత దేశంలోనే మోస్ట్ పాపులర్ టెక్ స్టార్టప్ లో ఒకటిగా నిలిచింది ఈ ఎడ్యుకేషన్ కంపెనీ. 60 శాతానికి పైగా ఓటు వేయడం విస్తు పోయేలా చేసింది.
తప్పు నిర్వహణ, వైఫల్యాల కారణంగా బైజూ పూర్తిగా అప్పుల్లోకి కూరుకు పోయిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.