లలిత జ్యువెలర్స్ పై కాగ్ కామెంట్
రూ. 53 లక్షలు ఏమయ్యాయని ప్రశ్న
హైదరాబాద్ – డబ్బులు ఊరికే రావు అనే ప్రకటన ప్రతి ఒక్కరినీ నిత్యం పలుకరిస్తూనే ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాలలో లలితా జ్యువెలర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా కాగ్ సదరు సంస్థపై కీలక వ్యాఖ్యలుచేసింది. 15. 39 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను లలిత జ్యువెలర్స్ క్లెయిమ్ చేసినట్లు కాగ్ పేర్కొంది.
ఇదే సమయంలో 14.85 కోట్లు తిరిగి ఇచ్చాడని మరి మిగిలిన రూ. 53 లక్షలు ఏమయ్యాయంటూ ప్రశ్నించింది. కాగ్ తాజాగా శాసన సభలో నివేదికను ప్రవేశ పెట్టింది. 2017-18 సంవత్సరానికి జీఎస్టీఆర్-9లోని టేబుల్ 8(బి)(సి) ప్రకారం పంజాగుట్ట ఎస్టీయు-1 కింద ఉన్న లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 56.61 కోట్ల ఐటీసీని పొందిందని కాగ్ నివేదికలో పేర్కొంది.
ఐటీసీ కేవలం రూ. 41.22 కోట్లు మాత్రమే ఉండగా అదనంగా రూ. 15.39 కోట్లు క్లెయిమ్ చేసినట్లు కాగ్ ప్రస్తావించింది. డీఆర్సీ -01 ద్వారా షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగిందని తెలిపింది. కాగా రూ. 53.52 లక్షల మేరకు బ్యాలెన్స్ ఉన్నట్లు రుజువు చేసే పత్రాలు ఆడిట్ శాఖకు ఇంకా అందించ లేదని పేర్కొంది కాగ్.