డబుల్ బెడ్ రూమ్ పథకం విఫలం
సంచలన ప్రకటన చేసిన కాగ్
హైదరాబాద్ – గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ పథకం పూర్తిగా ఆచరణలో విఫలమైందని, అంతులేని అవినీతి చోటు చేసుకుందంటూ సంచలన ఆరోపణలు చేసింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) .
గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు పడక గదుల ఇళ్ల పథకం అమలులో అవకతవకలు జరిగినట్టు కాగ్ స్పష్టం చేసింది. తీసుకున్న రుణాల మొత్తాలను కొంత కాలం పాటు లూప్ లైన్ లో పెట్టారంటూ పేర్కొంది. నిధులు ఇతర పథకాలు , సంస్థలకు మళ్లించ బడ్డాయని ఆరోపించింది.
తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌కు సంబంధం లేని ఇతర రుణాలను తిరిగి చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో మంజూరైన లక్ష ఇళ్లల్లో 48 వేల 178 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యాయని తెలిపింది. 45 వేల 735 ఇళ్లు పురోగతిలో ఉండగా 6,087 ఇళ్లు ఆగి పోయాయని మండిపడింది.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు కట్టించడంలో పూర్తిగా గత సర్కార్ విఫలమైందంటూ సంచలన ఆరోపణలు చేసింది కాగ్.