ఖలిస్తానీల ఏరివేతకు భారత్ ప్రయత్నం
కెనడా పోలీసుల సంచలన ఆరోపణలు
కెనడా – భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ముదిరి పాకాన పడ్డాయి. ఖలిస్తానీ ఉగ్రవాది దారుణ హత్య వెనుక కెనడాలో పని చేసిన భారత దేశానికి చెందిన రాయబారి వర్మతో పాటు మరికొందరు కారణమని కెనడా పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే భారత హై కమిషనర్ తో పాటు దౌత్య సిబ్బందిని వెంటనే కెనడాను విడిచి రావాల్సిందిగా ఆదేశించింది.
దీంతో హై కమిషనర్ వర్మతో పాటు ఇతర దౌత్య సిబ్బంది హుటా హుటిన ఇండియాకు చేరుకున్నారు. ఈ తరుణంలో ఆసియన్ సదస్సు జరిగింది ఇటీవలే. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు కెనడా పీఎం ట్రూడో. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ప్రధానమంత్రి. దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కెనడా పోలీసులు మరో బాంబు పేల్చారు. ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా పేరుపొందిన లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ను అడ్డం పెట్టుకుని భారత ప్రభుత్వం ఖలిస్తానీ అనుకూలురైన కెనడాలో ఉంటున్న వారిని టార్గెట్ చేసిందని ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. ఇదే సమయంలో తమ దేశంలో ఉన్న కెనడా రాయమారిని, ఇతర సిబ్బందిని వెళ్లి పోవాల్సిందిగా ఆదేశించింది.