జర్నలిస్టుల ల్యాండ్ రిజిస్ట్రేన్ రద్దు
బిగ్ షాక్ ఇచ్చిన నల్లగొండ జిల్లా కలెక్టర్
నల్లగొండ జిల్లా – ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎనిమిది మంది జర్నలిస్టులకు బిగ్ షాక్ తగిలింది. జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు జర్నలిస్టులకు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమికి సంబంధించి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కీలక ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
మెరుగైన సమాజం కోసం అంటూ ఒకరు, దమ్మున్న పత్రిక అంటూ మరొకరు , తెలంగాణ గుండె చప్పుడు అంటూ ఇంకొకరు ఇలా సంస్థలను అడ్డం పెట్టుకొని చేసిన తప్పుడు పనులు వెలుగు చూశాయి.
59 జీవో ముసుగులో నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని చీట్ చేసిన ఎనిమిది జర్నలిస్టుల బాగోతం బట్ట బయలు అయ్యింది.
అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న జర్నలిస్టుల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయా జర్నలిస్టుల వివరాలు తాజాగా వెలుగు చూశాయి.
నల్లగొండ జిల్లా ఈనాడు పత్రిక బ్యూరో చీఫ్ జిల్లెపల్లి దత్తురెడ్డి , నమస్తే తెలంగాణ పత్రిక బ్యూరో చీఫ్ మర్రి మహేందర్ రెడ్డి, టి న్యూస్ స్టాప్ రిపోరర్ట్ బూర రాము, టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ ముప్పా రేవాన్ రెడ్డి, క్రాంతి పోస్ట్ యూట్యూబ్ ఛానల్ చీఫ్ నారబోయిన క్రాంతి, ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ బోయపల్లి రమేష్ , ఒకప్పటి ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మార బోయిన మధుసూదన్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీఆర్వోగా ఉండడం విశేషం. వీరితో పాటు వెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ పసుపులేటి కిరణ్ కుమార్ ఉన్నారు.