రతన్ టాటా కోట్లాది మందికి స్పూర్తి
కెప్టెన్ జోయా తీవ్ర భావోద్వేగం
హైదరాబాద్ – భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన పది కాలాల పాటు బతకాలని కోరుకున్నారు. ఎన్నో సంస్థలను స్థాపించడమే కాకుండా వేలాది మందికి నీడనిచ్చారు. కోట్లాది మందికి సాయం చేశారు . ఆయన లేరన్న వార్తను నమ్మబుద్ది కావడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఈ సందర్బంగా కెప్టెన్ జోయా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రతన్ టాటాతో తాను తీసుకున్న అరుదైన చిత్రాన్ని ఎక్స్ వేదికగా గురువారం పంచుకున్నారు. నా హృదయంలో ఎల్లప్పటికీ ఈ చిత్రం గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. ఇలాంటి మహానుభావులు కొందరే ఉంటారని అన్నారు జోయా .
ఎన్ వైసీ నుండి ఢిల్లీకి వెళ్లేలా రతన్ టాటా తన జీవితాన్ని మార్చారని తెలిపారు. ఆయన వినయం, దయ, విలువలతో కూడిన జీవితం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని స్పస్టం చేశారు కెప్టెన్ జోయా.
రతన్ టాటా ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకే ఒక్క ఫోటో దిగాలని ఉందని కోరాను. తాను వెళ్లగానే ఆయనే నన్ను ఆపారు. కెప్టెన్ ఇది మీ సింహాసనం.. మీరు దీన్ని సంపాదించారు..అంటూ నా వెనకే వచ్చారని గుర్తు చేసుకున్నారు. తననే కాదు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మందిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు కెప్టెన్ జోయా.