శ్రీధర్ కార్టూన్ సంచలనం
కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ వైరల్
హైదరాబాద్ – తెలుగు పత్రికా ప్రపంచాన్ని శాసించిన రామోజీ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయనతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధం కలిగి ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్టూనిస్టు (చిత్రకారుడు) శ్రీధర్.
ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉంది. ఈనాడుకు ఎనలేని కీర్తిని, ప్రజల్లో ఆదరణను తీసుకు రావడంలో కీలకమైన పాత్రను పోషిస్తూ వచ్చారు కార్టూనిస్ట్ శ్రీధర్. కేవలం ఆయన వేసిన కార్టూన్లు కోట్లాది మందిని కదిలించాయి. వారిలో చైతన్యాన్ని రగిలించాయి. ఒక రకంగా చెప్పాలంటే కార్టూన్ చూశాకే పాఠకులు ఇతర వార్తలను చదివే వారన్న ప్రచారం ఉంది.
ఇది పక్కన పెడితే ప్రజాస్వామ్యానికి ప్రతీకగా , ప్రజల పక్షం వహించేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు కార్టూనిస్ట్ శ్రీధర్. ఈనాడులో భాగస్వామిగా ఉన్నారు. రామోజీరావుతో దగ్గరగా ఉండే వ్యక్తులలో ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
తాజాగా రామోజీరావు మరణం తట్టుకోలేక కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.