అల్లు అర్జున్ కు షాక్ కేసు నమోదు
సంధ్య థియేటర్ యజమానిపై కూడా
హైదరాబాద్ – ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 ది రూల్ చిత్రం రిలీజ్ సందర్బంగా తను సంధ్య థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చారు. ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ వింగ్ నిర్వాకం కారణంగా పలువురిపై లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో చాలా మంది స్పృహ తప్పి పడి పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
మరో వైపు టికెట్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు సతీష్ కమాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా రిలీజ్ సందర్బంగా జరిగిన న్యూసెన్స్ కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ డీసీపీ ఆకాన్ష్ యాదవ్ వెల్లడించారు.
చిత్ర యూనిట్ , అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యజమాని, హీరో సెక్యూరిటీ వింగ్ పై చిక్కడపల్లి స్టేషన్ లో 105, 118(1)r/w3(5) BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.