జనసేన నేత..కొరియో గ్రాఫర్ జానీపై కేసు
లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు
హైదరాబాద్ – తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన కొరియో గ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియో గ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు , నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు.
దీంతో జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) , స్వచ్ఛందంగా గాయ పరచడం (323)లోని క్లాజ్ (2) , (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జాని మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది.. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
అయితే జాని మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో చేరి జనసేన తరపున ప్రచారం చేసారు.