మహిళా కమిషన్ చీఫ్ పై వ్యతిరేక పోస్ట్
న్యూఢిల్లీ – తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహూవా మోయిత్రాకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై సామాజిక మాధ్యమాలలో అత్యంత అవమానకరమైన రీతిలో పోస్ట్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.
రేఖా శర్మ చేసిన ఫిర్యాదు మేరకు ఎంపీ మహూవా మోయిత్రాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి రేఖా శర్మ వచ్చినట్లు ట్విట్టర్ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు.
ఇదే వీడియోకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు మహూవా మోయిత్రా. ఆ తర్వాత ట్రోల్ కు గురి కావడంతో దానిని ట్విట్టర్ నుంచి తొలగించారు టీఎంసీ ఎంపీ. దీనిని సీరియస్ గా తీసుకుంది జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ.