ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు
బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ కూటమి సర్కార్
అమరావతి – వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది. ఊహించని రీతిలో ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చి పోయారు. అనరాని మాటలు మాట్లాడారు. వీరిలో మాజీ మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులు దారుణంగా మాట్లాడుతూ వచ్చారు.
అంతే కాకుండా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని టీడీపీ ప్రభుత్వంపై, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తదితరులను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది సర్కార్.
ఇందుకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా నియంత్రణపై ఓ చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. దీనిపై చంద్రబాబు ఓకే చెప్పారు.