వైసీబీ బాస్ జగన్ కు బిగ్ షాక్
అమరావతి – వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయగా తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై రెండు కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలపై దాడి, కౌన్సిల్ సభ్యులను నిర్బంధించారనే అభియోగాలతో తుని పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఎఆర్లు నమోదయ్యాయి.
కాగా తమ నాయకులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, ,అయినా బెదిరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు వైసీపీ బాస్ జగన్ రెడ్డి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కావాలని అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎవరూ కూడా అధైర్య పడవద్దని కోరారు. తాను ఉన్నానని, కూటమి సర్కార్ ను ఎదుర్కొంటానని హెచ్చరించారు.
ఇక నుంచి ప్రజలలోకి వెళతానని, మరోసారి పాదయాత్ర చేపడతానని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. అక్రమ కేసుల నమోదుపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇందులో వెనక్కి తగ్గేది లేదన్నారు మాజీ సీఎం. కూటమి సర్కార్ ప్రజాదరణ కోల్పోయిందన్నారు. ఫ్రస్టేషన్ కు గురైన సీఎం కావాలని కక్ష కట్టారంటూ పేర్కొన్నారు.