NEWSTELANGANA

సీనియ‌ర్ ఐఏఎస్ ల‌పై క్యాట్ సీరియ‌స్

Share it with your family & friends

డీఓపీటీ ఉత్త‌ర్వులు పాటించాల్సిందే

హైద‌రాబాద్ – ఏపీ కేడ‌ర్ కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌కు దిమ్మ తిరిగేలా కోలుకోలేని షాక్ ఇచ్చింది క్యాట్. ఐఏఎస్ ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నా ముందుగా డీఓపీటీ అనుమ‌తి తీసుకోవాల్సిందే. తాజాగా తెలంగాణ‌లో గ‌త కొన్నేళ్లుగా తిష్ట వేసుకుని ఇటు స‌చివాల‌యంలో అటు కీల‌క శాఖ‌ల‌లో చ‌క్రం తిప్పుతూ త‌మ‌కు ఎదురే లేద‌ని విర్ర వీగుతున్న ఆంధ్రాకు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్లు తెలంగాణ‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేదంటూ డీఓపీటీ స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టికే ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా హైద‌రాబాద్ లో ఉండేందుకు అల‌వాటు ప‌డిన స‌ద‌రు ఉన్న‌తాధికారులు స‌సేమిరా అంటూ క్యాట్ ను ఆశ్ర‌యించారు. త‌మ‌ను తెలంగాణ‌లోనే ఉండేలా ఆదేశించాలంటూ కోరారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన క్యాట్ మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అంతే కాదు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. డీఓపీటీ ఉత్త‌ర్వులు పాటించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. సీనియ‌ర్ ఐఏఎస్ లు వాకాటి అరుణ‌, ఆమ్ర‌పాలి, వాణిప్ర‌సాద్, రోనాల్డ్ రోస్ లు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఇవి చెల్ల‌వంటూ పేర్కొంది. మీరంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

అంతే కాదు ఏపీలో ఓ వైపు వ‌ర్షాలు ప‌డుతుంటే, తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే ఇక్క‌డ మీకు ఏం ప‌ని అంటూ ప్ర‌శ్నించింది. ఒక ర‌కంగా నిల‌దీసినంత ప‌ని చేసింది క్యాట్. వీరంతా గ‌త కేసీఆర్ స‌ర్కార్ హ‌యాంలో చ‌క్రం తిప్పారు..తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ హ‌యాంలో సైతం కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణ‌లో ఆంధ్రా అధికారుల పెత్త‌నంపై తెలంగాణ వాదులు, మేధావులు, ప్ర‌జా సంఘాల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.