న్యాక్ బృందానికి లంచాలు ఇవ్వడంపై
గుంటూరు జిల్లా – గుంటూరు జిల్లాలో ఉన్న కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీకి ఏ++ గుర్తింపు పొందేందుకు తనిఖీకి వచ్చిన న్యాక్ టీంకు లంచాలు ఇవ్వడం కలకలం రేపింది. యూనివర్శిటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. లంచం ఇచ్చిన మేనేజ్మెంట్ పైన, డబ్బులు తీసుకున్న సభ్యులపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఇతర ప్రతినిధులను , తనిఖీ టీంకు చెందిన 10 మందిని చేర్చించింది.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మందిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసింది సీబీఐ. న్యాక్ తనిఖీ బృందంలో దేశంలోని కీలకమైన యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు సభ్యులుగా ఉండడం మరింత విస్తు పోయేలా చేసింది. ఢిల్లీ, వైజాగ్ నుంచి సీబీఐ టీంలు కేఎల్ఐ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ , వడ్డేశ్వరంలోని క్యాంపస్ లో సోదాలు చేపట్టారు.
శనివారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఏ++ రేటింగ్ కోసం యాజమాన్యం బంగారం, ల్యాప్ టాప్ లు, నగదు , సెల్ ఫోన్స్ రూపంలో ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ టీంలు బెంగళూరు, విజయవాడ, సంబల్ పూర్, భోపాల్, ఢిల్లీలోని 20 చోట్ల న్యాక్ బృంద సభ్యుల నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు.
కేఎల్ఈఎఫ్ వైస్ ఛాన్సలర్ జీ.పి.సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజ హరీన్, కేఎల్యూ హైదరాబాద్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఉన్నారు.