అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు
అమరావతి – వైఎస్సార్సీపీకి, రాజ్యసభ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డికి భారీ ఊరట లభించింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు లైన్ క్లియర్ ఇచ్చింది. ఫ్రాన్స్ , నార్వే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. తన విదేశీ టూర్ కు సంబంధించి నెల రోజుల పాటు పర్మిషన్ ఇవ్వాలని కోరారు పిటిషన్ లో. కాగా కోర్టు మాత్రం కేవలం 15 రోజులు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు ఎప్పుడైనా వెళ్లవచ్చని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో విజయ సాయి రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి , రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ఉండగానే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, దివంగత వైఎస్సార్ ఫ్యామిలీకి అనుంగు అనుచరుడిగా, నమ్మిన బంటుగా పేరు పొందారు విజయ సాయిరెడ్డి. కానీ ఏమైందో ఏమో కానీ తను రాజకీయాల నుంచి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నానని, శేష జీవితం వ్యవసాయం చేస్తూ బతుకుతానంటూ వేదాంతం వల్లించారు.