ఎమ్మెల్యే పిన్నెల్లిపై సీఈసీ సీరియస్
క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం
అమరావతి – మాచర్ల శాసన సభ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారారు. అధికారం ఉంది కదా అని ఏకంగా పోలింగ్ సందర్బంగా మాచర్ల నియోజకవర్గంలో ఈనెల 13న జరిగిన పోలింగ్ సందర్బంగా బూత్ వద్దకు వెళ్లారు. దౌర్జన్యానికి పాల్పడ్డారు.
అంతే కాకుండా పోలింగ్ సిబ్బంది వారిస్తున్నా లెక్క చేయకుండా ఈవీఎంను ధ్వంసం చేశారు. బండ కేసి కొట్టారు. దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం సీసీ టీవీ ఫుటేజ్ లో నిక్షిప్తం అయ్యింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు మీనా. డీజీపీ ఎమ్మెల్యే వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా మాచర్లలో పెద్ద ఎత్తున గొడవలు, దాడులు చోటు చేసుకున్నాయి.