NEWSNATIONAL

జూన్ 16 లోపు ఎన్నిక‌లు పూర్తి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఈసీ రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూన్ 16వ తేదీ లోపు దేశ‌మంత‌టా ఎన్నిక‌లు పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

545 లోక్ స‌భ స్థానాల‌తో పాటు దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఏపీ, సిక్కిం, ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ల‌లో శాస‌న స‌భ ఎన్నిక‌ల గ‌డువు పూర్త‌యింద‌ని, వాటికి కూడా ఎన్నిక‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. కాశ్మీర్ లో కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంద‌న్నారు రాజీవ్ కుమార్.

దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో కోటి 50 ల‌క్ష‌ల మంది సిబ్బంది పాల్గొంటార‌ని చెప్పారు సీఈసీ. 55 ల‌క్ష‌ల ఈవీఎంలు వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు. కోటి 82 ల‌క్ష‌ల మంది కొత్తగా ఓట‌ర్లు న‌మోదైన‌ట్తు తెలిపారు.

వాలంటీర్లుగా, కాంట్రాక్టు ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న వారు ఎవ‌రూ కూడా ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు రాజీవ్ కుమార్.