NEWSNATIONAL

రూ. 10 వేల కోట్లు జ‌ప్తు చేశాం

Share it with your family & friends

కేంద్ర ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌ట‌న

న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రాజీవ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా భార‌తీయులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కున్నార‌ని ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది ఓ అరుదైన రికార్డు గా ఆయ‌న అభివ‌ర్ణించారు. 64 కోట్ల మందికి పైగా ఓటు వేశార‌ని ఇది జీ7 దేశాల కంటే అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించారు.

మొత్తంగా 17వ విడ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించామ‌ని చెప్పారు. త‌మ‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి రాజీవ్ కుమార్. 31 కోట్ల మందికి పైగా మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి ఎన్నిక‌ల్లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న రూ. 10, 000 కోట్లను జ‌ప్తు చేశామ‌ని ప్ర‌క‌టించారు రాజీవ్ కుమార్. ఇది కూడా ఓ చ‌రిత్ర కావ‌డం విశేషం.