NEWSNATIONAL

భార‌త ఓట‌ర్ల వ‌ర‌ల్డ్ రికార్డ్

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఈసీ

న్యూఢిల్లీ – దేశంలో 17వ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పండుగ ముగిసింది. జూన్ 4న మంగ‌ళ‌వారం తుది ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

భార‌త దేశానికి చెందిన ఓట‌ర్లు ప్ర‌పంచ చ‌రిత్ర సృష్టించార‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి రాజీవ్ కుమార్ సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 64.2 కోట్ల మంది ఓట్లు వేశార‌ని చెప్పారు. ఇది అరుదైన రికార్డు అంటూ పేర్కొన్నారు.

ఈ సంఖ్య జీ7 దేశాలైన అమెరికా, బ్రిట‌న్ , ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ , జ‌పాన్ , కెన‌డా, ఇట‌లీ జ‌నాభా కంటే 1.5 రెట్లు ఎక్కువ‌గా భార‌తీయులు ఓటు వేశార‌ని ఇది ఆహ్వానించ ద‌గిన ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు రాజీవ్ కుమార్.

ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓట్లు వేశార‌ని స్ప‌ష్టం చేశారు.