ఎగ్జిట్ పోల్స్ బక్వాస్ – సీఈసీ
రాజీవ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరాఠా, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్బంగా ప్రధాన మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (ముందస్తు అంచనా ) పేరుతో నానా హడావుడి చేస్తున్నాయని, దీని వల్ల ఇబ్బంది ఏర్పడుతోందన్నారు.
ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత అనేది లేదని స్పష్టం చేశారు. అందువల్ల ఓటర్లు, ప్రజలు నమ్మ వద్దని కోరారు రాజీవ్ కుమార్. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనా మాత్రమేనని, అవే ప్రామాణికం కాదని పేర్కొన్నారు సీఈసీ.
విచిత్రం ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ పేరుతో తమ టీఆర్పీ రేటింగ్స్ పెంచు కోవడానికి, లేదా తమ సంస్థలకు ఉచితంగా మైలేజ్ వస్తుందే తప్పా ప్రజలకు, దేశానికి ఒరిగింది ఏమీ ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు రాజీవ్ కుమార్.
ఆయా సంస్థలు, ప్రసార, ప్రచురణ, డిజిటల్ మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు ప్రకటించే ఉచితాలపై సుప్రీంకోర్టు నోటీసు ఇవ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు సీఈసీ. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు.