పాలమూరు బిడ్డకు అరుదైన గౌరవం
హైదరాబాద్ – కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి సంస్థకు సీఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పాలమూరు జిల్లాకు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎన్ .బలరాం పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది డీఓపీటీ. డిప్యూటేషన్ కాల పరిమితి మూడు ఏళ్లు మాత్రమే. కానీ తన నిజాయితీ, నిబద్దతను గమనించిన కేంద్రం ఐదేళ్లకు పొడిగించడం విశేషం. సింగరేణి సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉంటూనే సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బలరాం.
తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో ఎన్ . బలరాంకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరో ఏడాదికి డిప్యూటేషన్ పదవీ కాలం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. పాలమూరు జిల్లాలోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తను.
మనోడు పేదోడు, కష్టపడి చదువుకున్నాడు. సిటీ ఛే-నెంబరు దగ్గర కూలిపని చేసి పైచదువులు చదివాడు ఎన్.బలరాం . ఐఆర్ఎస్ సర్వీస్ కు ఎంపికయ్యాడు. అంతే కాదు తాను పడిన కష్టాలు ఇంకొకరు పడకూడదని తెలంగాణ పిల్లలు సివిల్స్ మెయిన్స్ లో రాణించాలని సింగరేణి సంస్థ ద్వారా చేయూత ఇస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఇవాళ వేలాది మంది విద్యార్థులలో స్పూర్తి నింపేలా చేసింది.