వరద బురద శుభ్రం అద్భుతం
ఏపీ సర్కార్ కు కేంద్ర బృందం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వరదల కారణంగా పేరుకు పోయిన వరద బురదను తొలగించేందుకు తీసుకున్న చర్యలు అద్బుతంగా ఉన్నాయంటూ కితాబు ఇచ్చింది కేంద్ర వైద్య ఆరోగ్య బృందం.
భారీ వర్షాలు ఏపీని అతలా కుతలం చేశాయి. ఈ తరుణంలో 6 లక్షల మందికి పైగా నిరాశ్రయులుగా మారారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది తెలుగుదేశం కూటమి సర్కార్. ప్రధానంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నీ తానై వ్యవహరించారు. సహాయక చర్యలు ముమ్మురంగా చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ప్రధానంగా పేరుకు పోయిన చెత్తా, చెదారంతో పాటు పారిశుధ్యంను తొలగించేందుకు ఫోకస్ పెట్టారు. చాలా చోట్ల అత్యాధునిక యంత్రాలను వాడారు.
ప్రత్యేకించి గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన వరద బురదను తొలగించేందుకు ఫైరింజన్లను ఉపయోగించారు. ఈ సందర్బంగా ఏపీలో పర్యటించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బృందం. వరద ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని కితాబు ఇచ్చింది.
వ్యాధులు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కేంద్ర బృందం భేటీ ముగిసింది.