ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించనున్నారు. రెండో సారి డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వెళ్లనున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల అధినేతలు వివిధ అంశాలపై చర్చించనున్నారని కేంద్రం వెల్లడించింది. మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కూడా వెళతారని తెలిపింది. కాగా ట్రంప్ వచ్చాక అక్రమ వలసదారులపై వేటు వేశారు. ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీని గురించి మోడీ ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా రెండవ సారి అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా తన రాకతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు మింగుడు పడడం లేదు. పనిగట్టుకుని తీవ్రవాదాన్ని, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ కు కంటి మీద కునుకు ఉండడం లేదు.
మరో వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది డొనాల్డ్ ట్రంప్ కు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కారణంగా భారత్ కు ప్రయారిటీ ఎక్కువగా ట్రంప్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు ట్రంప్ కు సంబంధించిన వ్యాపారాలు భారత్ లో ఉన్నాయి. ఇది కూడా మేలు చేకూర్చే అంశం.