మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం రూ. 22,507 కోట్లు
వెల్లడించిన మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి – మోడీ కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. అర్బన్ మొబిలిటీలో భాగంగా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ఫేజ్ -1 కు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
బుధవారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వైజాగ్, బెజవాడ మెట్రో ప్రాజెక్టులు ఫేజ్ -1కు గాను రూ. 22,507 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్ .
ఇందులో భాగంగా వైజాగ్ మెట్రోను 46.23 కి.మీ, విజయవాడకు 38.40 కి.మీ మేర పనులు చేపట్టనున్నారు.
భారతదేశం అంతటా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ,కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సత్య కుమార్ యాదవ్. ఇదే సమయంలో రాష్ట్రం తరపున కృషి చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలతో పాటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు థ్యాంక్స్ తెలిపారు.