సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బెట్టింగ్ యాప్స్ దందా , మోసం పెద్ద ఎత్తున జరుగుతుండడం, కోట్లల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది దేశ వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తూ అడ్డంగా దొరికి పోయిన 11 మంది యూట్యూబర్స్ తో పాటు సినీ రంగానికి చెందిన నటీ నటులపై కేసులు నమోదు చేశారు. దీనిపై ఈడీ కూడా ఆరా తీస్తోంది. తాజాగా సెక్షన్ 69 కింద 357 ఆన్ లైన్ గేమ్స్ వెబ్ సైట్ ల యుఆర్ఎల్ లను బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం వినియోగదారులను రక్షించడానికి, దేశ ఆర్థిక సమగ్రతను నిలబెట్టడానికి అక్రమ ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలను ముమ్మరం చేసింది. మార్చి 22, 2025 నాటికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69 కింద మొత్తం 357 అటువంటి వెబ్‌సైట్‌లు, URLలు బ్లాక్ చేయబడ్డాయి. అదనంగా, ఆన్‌లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్, జూదంలో పాల్గొన్న సుమారు 700 కంటే ఎక్కువ ఆఫ్‌షోర్ సంస్థలు ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) పరిశీలనలో ఉన్నాయి.