హైదరాబాద్ లో ఖేలో ఇండియా పోటీలు
2026లో నిర్వహించేందుకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ కు ఖుష్ కబర్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డికి క్రీడలంటే ఇష్టం. ఆయన సీఎంగా కొలువు తీరిన నాటి నుంచి క్రీడాభివృద్ది కోసం తమ సర్కార్ శత విధాలుగా ప్రయత్నం చేస్తోందని చెబుతూ వచ్చారు. ఈ సందర్బంగా ఆయన ఢిల్లీ టూర్ కు వెళ్లిన ప్రతిసారి కేంద్రంతో క్రీడాభివృద్దికి, పోటీలు నిర్వహించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు .
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలను వచ్చే ఏడాది 2026లో హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఓకే చెప్పింది. 2025లో బీహార్ లో నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రతినిధి జితేందర్ రెడ్డి ,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయను కలిశారు. వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఖేల్ ఇండియా పోటీల ఆతిథ్యంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు ఆముదాలపాడు జితేందర్ రెడ్డి. కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి.