Saturday, April 19, 2025
HomeNEWSNATIONALనో డిటెన్ష‌న్ విధానం ర‌ద్దు

నో డిటెన్ష‌న్ విధానం ర‌ద్దు

విద్యార్థుల‌కు కేంద్రం షాక్

ఢిల్లీ – మోడీ ప్ర‌భుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది దేశంలోని విద్యార్థుల‌కు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నో డిటెన్ష‌న్ విధానాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీని ద్వారా ఇకపై 5 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. కాగా విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు.

అయితే ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు ఏ పాఠశాల నుంచి పిల్లలను బహిష్కరించ రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ)కి చేసిన సవరణను అనుసరించి, కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే రెండు తరగతులకు ‘నో-డిటెన్షన్ విధానాన్ని’ తొలగించాయి.

పునః పరీక్షలో హాజరయ్యే విద్యార్థులు మళ్లీ పదోన్నతి ప్రమాణాలను నెర వేర్చడంలో విఫలమైతే, సందర్భాను సారంగా ఐదవ తరగతి లేదా ఎనిమిదో తరగతిలో తిరిగి ఉంచాలని స్ప‌ష్టం చేసింది కేంద్రం. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పే స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు, క్లాస్ టీచ‌ర్ల‌కు కూడా మార్గ నిర్దేశ‌నం చేయాల‌ని సూచించింది.

కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యాల విద్యాలయాలు , సైనిక్ పాఠశాలలతో సహా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3,000 పాఠశాలలకు నోటిఫికేషన్ వర్తిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments