ENTERTAINMENT

చ‌క్రీ నీ పాట మిగిలే ఉంది

Share it with your family & friends

ఇవాళ స్వ‌ర క‌ర్త జ‌యంతి

హైద‌రాబాద్ – తెలుగు సినిమా రంగంలో మోస్ట్ పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందారు తెలంగాణ ప్రాంతానికి చెందిన చ‌క్రి. త‌ను అందించిన సంగీతం ఎంద‌రిని ఆక‌ట్టుకుంది..అల‌రించింది.మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా చేసింది. అద్బుత‌మైన బాణీలు ఇచ్చాడు చ‌క్రి. కానీ ఎదుగుతున్న స‌మ‌యంలోనే త‌నువు చాలించాడు. ఇవాళ చ‌క్రి జ‌యంతి.

మ‌రోసారి చ‌క్రిని గుర్తు చేసుకోవాల్సిన స‌మ‌యం. జూన్ 15న 194లో మ‌హ‌బూబాబాద్ జిల్లా కంబాల‌ప‌ల్లిలో పుట్టాడు. డిసెంబ‌ర్ 15, 2014లో చ‌ని పోయాడు. త‌న వ‌య‌సు అప్ప‌టికి ఇంకా 40 ఏళ్లే. మ్యూజిక్ కంపోజ‌ర్ , సింగ‌ర్ కూడా. ఆయ‌న అస‌లు పేరు గిల్లా చ‌క్ర‌ధ‌ర్. త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చాక చ‌క్రిగా మార్చుకున్నాడు.

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందాడు. సింహ మూవీకి గాను ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా నంది పుర‌స్కారం అందుకున్నాడు చ‌క్రి. త‌న కెరీర్ ను పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాచి సినిమాతో మొద‌లు పెట్టాడు 2000లో . ఆ త‌ర్వాత చ‌ని పోయేంత వ‌ర‌కు 85 సినిమాల‌కు సంగీతం అందించాడు. వివిధ భాష‌ల్లో కూడా సినిమాల‌కు ప‌ని చేశాడు చ‌క్రి.