బీఆర్ఎస్..బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్
ఎంపీ చామల కిరుణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయని ఆరోపించారు. అయినా ప్రజలు గమనించారని, తమకు ఎంపీ సీట్లను కట్టబెట్టారని చెప్పారు.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నాయని సంచలన కామెంట్స్ చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇందులో భాగంగానే లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ వ్యవహరించిదని, బలమైన అభ్యర్థులను తమ పార్టీ తరపున పోటీకి నిలబెట్ట లేదని ఆరోపించారు.
సికింద్రాబాద్ బీఆర్ఎస్ చచ్చిపోయి కిషన్ రెడ్డికి అవయవ దానం చేయలేదా అని ప్రశ్నించారు. గత వారం రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న నాటకాలు ఎవరికీ తెలియదు అనుకున్నారా అంటూ నిలదీశారు ఎంపీ.