టచ్ లో లేను బీజేపీలో చేరను – చంపాయ్ సోరేన్
స్పష్టం చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి
ఢిల్లీ – జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం లీడర్ చంపాయ్ సోరేన్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఆయన ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు ఎవరితో టచ్ లో లేనని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు మాజీ సీఎం.
పశ్చిమ బెంగాల్ లో సువేంద్ అధికారిని కలిశారా అన్న ప్రశ్నకు చంపాయ్ సోరేన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను ఇంకొకరితో కలిసే ఛాన్స్ లేదని అన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ కలవాలని అనుకోడం లేదన్నారు. కేవలం తన వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీకి వచ్చానని చెప్పారు మాజీ సీఎం.
ఇదిలా ఉండగా ఈ ఏడాది చివరలో జార్ఖండ్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో జేఎంఎం నేత ఢిల్లీలో పర్యటించడం మరింత ఆసక్తిని రేపింది. రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించింది.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శిబూ సోరేన్ అరెస్ట్ కావడంతో చాంపయ్ సోరేన్ అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో సోరేన్ తిరిగి సీఎం పదవిలో కూర్చున్నారు. దీంతో ఏం జరుగుతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది సర్వత్రా.