ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్
దుబాయ్ – రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి విశ్వ రూపం ప్రదర్శించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు 4 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఒకానొక దశలో 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన కోహ్లీ , శ్రేయస్ అయ్యర్ లు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ సింగిల్స్,, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
కోహ్లీ 84 రన్స్ చేస్తే అయ్యర్, రాహుల్ 40 పరుగులకు పైగా చేశారు. ఇక ఎప్పటి లాగే అక్షర్ పటేల్ 21 రన్స్ తో ఆకట్టుకోగా హార్దిక్ పాండ్యా 28 రన్స్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో టీమిండియా 48.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. 267 పరుగులు చేసింది. నేరుగా ఫైనల్ కు వెళ్లింది. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోరులో గెలిచే జట్టుతో రోహిత్ సేన తలపడనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా స్కిప్పర్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 264 పరుగులు చేసింది. స్మిత్ ఒక్కడే రాణించాడు. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే మొహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి , రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.