ఏపీ అభివృద్ది కోసమే పొత్తు
చంద్రబాబు నాయుడు ట్వీట్
అమరావతి – భారతీయ జనతా పార్టీతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు కుదుర్చుకున్నామని , వ్యక్తిగత లాభం కోసం కాదని పేర్కొన్నారు.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయేతో తిరిగి చేరడం సంతోషం కలిగించిందని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఏపీ అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. తెలుగుదేశం , జనసేన, బీజేపీ ఉమ్మడిగా మేని ఫెస్టోలను ప్రకటిస్తాయని, కొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పూర్తి స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తమ మూడు పార్టీలది పొత్తు మాత్రమే కాదని, రాష్ట్ర, దేశ అభివృద్దికి పాటుపడే భాగస్వామ్య కూటమి అని కుండ బద్దలు కొట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో అధికారాన్ని అప్పచెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు చంద్రబాబు నాయుడు. మోదీతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.