బాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా
ఈనెల 26 వరకు మాజీ సీఎంకు భారీ ఊరట
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊరట నిచ్చేలా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆయనపై ఏపీ సీఐడీ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ప్రధానంగా ఆయన ఏపీ స్కిల్ స్కాం కేసును ఎదుర్కొంటున్నారు. ఇదే కేసుకు సంబంధించి దాదాపు 53 రోజులకు పైగా ఆయన జైలు జీవితం గడిపారు. రాజమండ్రి జైలు నుంచి రావడానికి నానా తంటాలు పడ్డారు.
ఒక రకంగా సుప్రీంకోర్టుకు చెందిన ప్రధాన లాయర్లు విజయవాడకు వచ్చారు. వాళ్లు వాదించినా ఏమీ చేయలేక పోయారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొంత ఊరట లభించేలా కోర్టు వ్యవహరించింది.
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు సంబంధించి కోర్టు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.