NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ నాతో పోటీ ప‌డగ‌లవా

Share it with your family & friends

నీకంటే నేను ఎంతో బెట‌ర్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ప్ర‌జా గ‌ళం పేరుతో ప్ర‌చారాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు. నా వ‌య‌సు గురించి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చుల‌క‌న చేసి మాట్లాడ‌టంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

వ‌య‌సులో పెద్ద వాడినైనా , 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుభవం క‌లిగిన త‌న‌కు గౌర‌వం ఇవ్వాల్సింది పోయి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న యువ‌కుడైనా త‌న‌తో పోటీ ప‌డే స‌త్తా లేద‌న్నారు.

నా మాదిరిగా మండు టెండ‌లో ఒక మూడు స‌మావేశాల‌లో పాల్గొనే స‌త్తా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఉందా అని నిల‌దీశారు. పోనీ సాయంత్రం అయ్యేస‌రికి త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌గ‌ల‌డా అని నిప్పులు చెరిగారు చంద్ర‌బాబు నాయుడు.

ప్ర‌జ‌ల‌కు ఏం చేశాడ‌ని అంటున్నాడ‌ని, చిన్న పిల్ల‌ల‌ను అడిగినా తాను ఏపీకి ఏం చేశానో చెబుతారంటూ స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్‌.