తెలంగాణలో వర్షం ఏపీ అప్రమత్తం
సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
విజయవాడ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం వరద ప్రభావిత ప్రాంతాలపై ఆరా తీశారు. శనివారం విజయవాడ కలెక్టరేట్ లో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వరద పరిస్థితులపై వాకబు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
వరద బాధితుల కష్టాలపై అవిశ్రాంతంగా పని చేస్తున్నాం.. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని ఈ సందర్బంగా కలెక్టర్లు, ఎస్పీలు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రానికి వరద నీరు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్బంగా తెలిపారు చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో తాజాగా వాతావరణ శాఖ చేసిన సూచనల మేరకు ఏపీ రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, అక్కడి నీళ్లు ఏపీని ముంచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.