NEWSANDHRA PRADESH

పెన్ష‌న్ల పంపిణీపై ఫోక‌స్ పెట్టాలి

Share it with your family & friends

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో వాలంటీర్లు విధులు నిర్వ‌హించ కూడ‌ద‌ని ఇప్ప‌టికే ఈసీ స్ప‌ష్టం చేసింది. తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కు. సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి వాలంటీర్లు విధులు నిర్వ‌హించ కూడ‌ద‌ని ఆదేశించింది. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింద‌ని తెలిపారు చంద్ర‌బాబు నాయుడు.

దీంతో ప్ర‌స్లుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని , ఎన్నిక‌ల కోడ్ అమలులో ఉంద‌ని తెలిపారు. ఏపీ స‌ర్కార్ దొడ్డి దారిన వాలంటీర్ల‌ను అడ్డం పెట్టుకుని ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయాల‌ని చూస్తోందంటూ ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

వెంట‌నే జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని కోరారు టీడీపీ చీఫ్‌. ల‌బ్దిదారుల‌కు రేప‌టి లోగా పెన్ష‌న్లు అందేలా చూడాల‌ని సూచించారు . లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ ల పంపిణీ నిలిచి పోకూడదన్నారు.