NEWSANDHRA PRADESH

21న టీడీపీ అభ్య‌ర్థుల‌కు బి ఫారాలు

Share it with your family & friends

ఇవ్వ‌నున్న పార్టీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు.

రాష్ట్రంలో 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులకు స్వయంగా బీ ఫారం అందజేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సామాజిక వేదిక‌గా తెలిపింది.

ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకటి రెండు రోజుల్లోనే తేల్చేయాలని ఆదేశించారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న టీడీపీ జోనల్ ఇంఛార్జి లతో సమావేశం అయ్యారు. దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని జోనల్ ఇంఛార్జి లకు పార్టీ బాస్ సూచించారు. ఎక్క‌డ కూడా అజాగ్ర‌త్త ప‌నికి రాద‌న్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళ్లాల‌ని కోరారు. టీడీపీ ఓటు చీల‌కుండా చూసుకోవ‌డం, ప్ర‌త్య‌ర్థి ఏం చేస్తున్నార‌నే దానిపై ఫోక‌స్ పెట్ట‌డం జ‌ర‌గాల‌న్నారు.