NEWSANDHRA PRADESH

నాలుగో సారి సీఎంగా బాబు స‌భ‌కు

Share it with your family & friends

చ‌రిత్ర సృష్టించిన టీడీపీ బాస్

అమ‌రావ‌తి – నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం స‌గ‌ర్వంగా ఏపీ రాష్ట్ర శాస‌న స‌భ‌కు అడుగు పెట్ట‌నున్నారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్ల‌ను ఎదుర్కొన్నారు. కానీ దేశ రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన నారా చంద్ర‌బాబు నాయుడు వ‌యసు మీద ప‌డినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌ను కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగారు. త‌న పార్టీని విజ‌య ప‌థంలోకి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు .

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 175 స్థానాల‌కు గాను ఏకంగా 164 స్థానాలు సాధించింది. ఇందులో బాబు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం త‌ను నాల్గ‌వ సారి ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. జూన్ 21న తొలిసారిగా నిండు స‌భ‌లో అడుగు పెట్ట‌నున్నారు.

ప్ర‌జా పాల‌న అందిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.